మా సమర్థత గురించి అతడికేం తెలుసు

ABN , First Publish Date - 2020-07-13T09:08:14+05:30 IST

భారత క్రికెట్‌ గురించి అనుచితంగా మాట్లాడడం మానుకోవాలని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌కు సునీల్‌ గవాస్కర్‌ హితవు పలికాడు.

మా సమర్థత గురించి అతడికేం తెలుసు

నాసిర్‌పై గవాస్కర్‌ ఫైర్‌

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ గురించి అనుచితంగా మాట్లాడడం మానుకోవాలని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌కు సునీల్‌ గవాస్కర్‌ హితవు పలికాడు. సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీకు ముందు భారత జట్టు అంత పటిష్ఠంగా కనిపించేది కాదన్న అతడి కామెంట్‌ను సన్నీ తీవ్రంగా తప్పుపట్టాడు. ‘1970, 80వ దశకాల్లో భారత జట్టు సామర్థ్యం గురించి అసలు నాసిర్‌కు ఏం తెలుసు? సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ గెలిచిన జట్టది. గంగూలీ సారథ్యంలో టీమిండియా చాలా విజయాలు సాఽధించడం నిజమే. కానీ అంతకుముందున్న జట్లు పటిష్ఠం కావని తీసి పారేయడం అర్థం లేనిది’ అని గవాస్కర్‌ విరుచుకుపడ్డాడు. గంగూలీ హయాంలోనే దూకుడు పెరిగిందని, వారితో క్రికెట్‌ ఆడడమంటే యుద్ధం చేసినట్టేనని ఇటీవల నాసిర్‌ హుస్సేన్‌ తెలిపాడు. 

Updated Date - 2020-07-13T09:08:14+05:30 IST