Abn logo
Oct 21 2021 @ 00:36AM

పరుగు పందెంలో గౌతమ్‌ ప్రతిభ

హుజూర్‌నగర్‌  రూరల్‌, అక్టోబరు 20 :  అండర్‌-14 పరుగు పందెం పోటీల్లో హుజూర్‌ నగర్‌ మండల విద్యార్థి సిల్వర్‌మెడల్‌ సాధిం చాడు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో గోవాలో నిర్వహించిన 200 మీటర్ల పరుగులో బూరుగడ్డకు చెందిన కాసాని గౌతమ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. గ్రామానికి చెందిన బాలుడు మెడల్‌ సాధించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గౌతమ్‌ హైదరాబాద్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మెడల్‌ సాధించడం ఆనందంగా ఉందని గౌతమ్‌ అన్నారు.