ఉత్తమ వన్డే బ్యాట్స్‌మెన్ సచినే.. కోహ్లీ కాదు: గంభీర్

ABN , First Publish Date - 2020-05-22T01:04:30+05:30 IST

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని పోల్చడం ఎప్పటి నుంచో జరుగుతోంది. సచిన్ తన కెరీర్‌లో సాధించిన

ఉత్తమ వన్డే బ్యాట్స్‌మెన్ సచినే.. కోహ్లీ కాదు: గంభీర్

న్యూఢిల్లీ: టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని పోల్చడం ఎప్పటి నుంచో జరుగుతోంది. సచిన్ తన కెరీర్‌లో సాధించిన రికార్డులను విరాట్ కూడా సాధిస్తారని.. చాలా మంది అంటారు. అయితే టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మాత్రం విరాట్ కోహ్లీ కంటే.. సచిన్ ఎంతో అత్యుత్తమైన బ్యాట్స్‌మెన్ అని అంటున్నారు. అందుకు మారిన నిబంధనలే కారణమని ఆయన తెలిపారు. 


ఇప్పుడు రెండు బంతులు, 30 యార్డుల సర్కిల్‌లో ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండటం బ్యాట్స్‌మెన్లకు సులభంగా మారిందని ఆయన పేర్కొన్నారు.  ‘‘సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ క్రికెటర్.. ఎందుకంటే.. ఒక వైట్ బాల్ నలుగురే ఫీల్డర్లు సర్కిల్‌లో ఉన్న ఆయన పరుగుల వరదపారించారు.’’ అని గంభీర్ తెలిపారు. ‘‘విరాట్ కోహ్లీ అత్యద్భుత ప్రదర్శన చేశాడు. కానీ నిబంధనలు చాలా మారాయి. అది బ్యాట్స్‌మెన్లకు ఎంతో ఉపయోగపడింది. ఈ జమనాలో రెండు బంతులు వాడుతున్నారు. రివర్స్ స్వింగ్ లేదు. ఇక 50 ఓవర్ల ఫార్మాట్‌లో పవర్‌ప్లేలో సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లే ఉంటున్నారు.  అది బ్యాట్స్‌మెన్లకు చాలా సులభంగా మారింది’’ అని గంభీర్ అన్నారు. 

Updated Date - 2020-05-22T01:04:30+05:30 IST