ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2,110 కోట్ల డాలర్లు పెరిగిన ఆస్తి
మస్క్, బెజోస్, బిల్‌గేట్స్ సంపద వృద్ధి కన్నా అధికం..
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2,110 కోట్ల డాలర్లు పెరిగిన ఆస్తి
మస్క్, బెజోస్, బిల్‌గేట్స్ సంపద వృద్ధి కన్నా అధికం..
ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ తిరోగమనంలో పయనించినప్పటికీ.. అదానీ కంపెనీల షేర్లు రేసు గుర్రాల్లా దూసుకెళ్లడంతో ఆ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది. బ్లూంబర్గ్ బిలియనీర్ రియల్‌టైం ఇండెక్స్ ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో అదానీ ఆస్తి 2,110 కోట్ల డాలర్లు (రూ.1.6 లక్షల కోట్లు) పుంజుకుంది. ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ ఈ ఏడాదిలో పోగేసిన మొత్తం కంటే అధికమిది. కాగా, గడిచిన మూడు నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ నెట్‌వర్త్ పెరుగుదల 824 కోట్ల డాలర్లకు పరిమితమైంది. అయితే, 9,820 కోట్ల డాలర్ల మొత్తం సంపదతో అంబానీ ఆసియాలోనే అత్యంత కుబేరుడుగా కొనసాగుతుండగా.. అదానీ 9,760 కోట్ల నెట్‌వర్త్‌తో ఆసియా నం.2గా ఉన్నారు.