పెద్ద పులి భయం

ABN , First Publish Date - 2020-07-13T11:49:09+05:30 IST

వెలుగోడు సమీపంలోని గట్టుతాండ పరిసర ప్రాంతంలోని నీలగిరి చెట్ల ప్రదేశంలో శనివారం గొర్రెలమందపై పెద్దపులి దాడి చేసిన ..

పెద్ద పులి భయం

అటవీ అధికారుల గాలింపు


 పాములపాడు(వెలుగోడు), జూలై 12: వెలుగోడు సమీపంలోని గట్టుతాండ పరిసర ప్రాంతంలోని నీలగిరి చెట్ల ప్రదేశంలో శనివారం గొర్రెలమందపై పెద్దపులి దాడి చేసిన సంగతి విదితమే. ఆదివారం పెద్దపులి కదలికలపై అటవీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు పెద్దపులి జనావాసాల్లోకి రావడంతో సమీప గిరిజన తండావాసులు భయందోళన చెందుతున్నారు. గత నెలలో గట్టుతాండ శివారులో బండ్రవాగు పరిసర ప్రాంతంలో పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది. అలాగే రెండు రోజుల కిత్రం గట్టుతండాకు చెందిన హనుమాన్‌నాయక్‌ గొర్రెలమందపై పెద్దపులి దాడి చేయగా రెండు గొర్రెలు మృతి చెందాయి. వెలుగోడు అటవీ రేంజ్‌ అధికారి దత్తాత్రేయ, ఎఫ్‌ఎ్‌సవో శ్రీనివాసులు, ఎఫ్‌బీవో మహానంది, ప్రొటెక్షన్‌ వాచర్లు ఆదివారం పెద్దపులి సంచరించిన ప్రాంతంలో గాలించారు.   వెలుగోడు అటవీ రేంజ్‌ అధికారి దత్తాత్రేయ మాట్లాడుతూ పెద్దపులి కదలికలపై గాలింపు చేపట్టామని క్యాంపు ఏర్పాటు చేస్తామని అన్నారు. 

Updated Date - 2020-07-13T11:49:09+05:30 IST