గుది బండ

ABN , First Publish Date - 2022-07-07T05:05:53+05:30 IST

పేద, మధ్య తరగతి కుటుంబాలపై మరోసారి గ్యాస్‌ బండ బాదుడు పడింది. 14.2 కిలోల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ గ్యాస్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు మంగళవారం రాత్రి అమలులోకి వచ్చాయి. దీంతో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులపై గ్యాస్‌ రూపంలో మరింత భారం పడింది.

గుది బండ

- మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధరలు
- సిలిండర్‌పై రూ.50 పెంపు
- వినియోగదారులపై మరింత భారం
(సోంపేట/నందిగాం)

పేద, మధ్య తరగతి కుటుంబాలపై మరోసారి గ్యాస్‌ బండ బాదుడు పడింది. 14.2 కిలోల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ గ్యాస్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు మంగళవారం రాత్రి అమలులోకి వచ్చాయి. దీంతో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులపై గ్యాస్‌ రూపంలో మరింత భారం పడింది. జిల్లాలో ఇండియన్‌, హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌ వినియోగదారులు సుమారు 8లక్షల మంది ఉన్నారు. గ్యాస్‌ కంపెనీలు ప్రతినెలా ఒకటో తేదీన సమీక్షించి ధరలు పెంచడం పరిపాటిగా మారింది. తాజాగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సిలిండర్‌పై రూ.50 పెంచింది. దీంతో సిలిండర్‌ ధర రూ.1,084కి చేరింది. ఈ క్రమంలో జిల్లావాసులపై రూ.4కోట్ల మేర అదనపు భారం పడనుంది. ప్రభుత్వం గ్యాస్‌ ధరలు ఎప్పటికప్పుడు పెంచడమే తప్ప.. తగ్గించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఒక్కో సిలిండర్‌పై రూ.200కు పైగా పెరిగిందని ఆరోపిస్తున్నారు. గతంలో మాదిరి సబ్సిడీ కూడా వర్తించడం లేదని వాపోతున్నారు.  


 

Updated Date - 2022-07-07T05:05:53+05:30 IST