Abn logo
Feb 7 2020 @ 01:24AM

అమెరికా తరహాలో సమద్రంలో గ్యాస్‌ పైపులైన్లు

అమలాపురం టౌన్‌, ఫిబ్ర వరి 6:

ఏళ్ల తరబడి కోనసీమ తీరప్రాంతాల్లో జరుగుతున్న బ్లోఅవుట్లను, గ్యాస్‌ లీకేజీలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు. అమలాపురంలో మోకా వెంకటసుబ్బారావు స్వగృహంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడారు. వరుసగా జరుగుతున్న బ్లోఅవుట్‌ల నేపథ్యం లో అనేక సూచనలు కేంద్ర ప్రభు త్వానికి అందాయన్నారు. అమెరికా తరహాలో సముద్రంలోనే గ్యాస్‌ పైపులైన్లు వేయడం ద్వారా ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టవచ్చునని అందిన సూచనలను పరిగణలోనికి తీసుకోవడం జరిగిందన్నారు.
 
అంతే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గ్యాస్‌ లీకేజీలను అరికట్టే విధంగా చర్యలు చేపట్టారన్నారు. గ్యాస్‌ లీకేజీలతో కోనసీమ ప్రజలు భయాందోళనలకు గురి అవుతు న్నారన్నారు. గ్యాస్‌ లీకేజీలను గుర్తించేందుకు ఎలక్ర్టానిక్‌ పద్ధతి లో సెన్సార్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంతోపాటు ఆయా గ్యాస్‌ పైపులైన్లను జియో ట్యాగింగ్‌ చేయడం జరిగిందన్నారు. ప్రతీ వంద కిలోమీటర్ల దూరానికి ఒక గ్యాస్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఎల్‌అండ్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. ఈ విధానం ద్వారా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉంటుందన్నారు. ఆవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన అవసరాన్ని వివరించారు. దశాబ్ధాల క్రితం వేసిన పైపులైన్లపై కేంద్ర పెట్రోలియం శాఖ దృష్టి సారించిందని మాధవ్‌ వివరించారు.

Advertisement
Advertisement
Advertisement