గ్యాస్ లీక్... త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2020-08-09T17:57:22+05:30 IST
చిన్నగురుదాసుపురంలో శనివారం కొండె సీతమ్మ ఇంట్లో గ్యాస్ లీకై..
పలాసరూరల్(శ్రీకాకుళం): చిన్నగురుదాసుపురంలో శనివారం కొండె సీతమ్మ ఇంట్లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. సీతమ్మ వంట చేసుకునేందుకు కట్టెల పొయ్యిను వెలిగించింది. అప్పటికే గ్యాస్ పొయ్యి నుంచి గ్యాస్ లీక్ అవుతుండడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఆమె గ్యాస్ రెగ్యులేటర్‌ను బంద్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు కొద్దిగా వ్యాపించడంతో గ్యాస్ దిమ్మతోపాటు పక్కనే ఉన్న స్టీల్ సామగ్రి, టేబుల్ ఫ్యాన్, కూరగాయలు మాడిపోయాయి.