AP News: అచ్యుతాపురంలో మళ్లీ గ్యాస్‌ లీక్‌

ABN , First Publish Date - 2022-08-03T03:13:11+05:30 IST

అనకాపల్లి: అచ్యుతాపురం (Achyutapuram) బ్రాండిక్స్‌లో మళ్లీ గ్యాస్‌ లీక్‌ (Gas Leak) అయ్యింది. విషవాయువు లీక్ కావడంతో పలువురికి అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్‌ కంపెనీ నుంచి ఈ విష వాయువు లీకవ్వడంతో సుమారు వందకు పైగా మహిళా ఉద్యోగులకు వాంతులయ్యాయి. కొంతమంది మహిళా ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోయారు. కొందరికి ప్రథమచికిత్స చేసి,

AP News: అచ్యుతాపురంలో మళ్లీ గ్యాస్‌ లీక్‌

అనకాపల్లి: అచ్యుతాపురం (Achyutapuram) బ్రాండిక్స్‌లో మళ్లీ గ్యాస్‌ లీక్‌ (Gas Leak) అయ్యింది. విషవాయువు లీక్ కావడంతో పలువురికి అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్‌ కంపెనీ నుంచి ఈ విష వాయువు లీకవ్వడంతో సుమారు వందకు పైగా మహిళా ఉద్యోగులకు వాంతులయ్యాయి. కొంతమంది మహిళా ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోయారు. కొందరికి ప్రథమచికిత్స చేసి, విషవాయువు ప్రభావానికి ఎక్కువగా లోనైన వారిని ఫ్యాక్టరీ బస్సులు, కార్లుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మే మాసం మొదటి వారంలో ఇదే ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-03T03:13:11+05:30 IST