గ్రేటర్‌లో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌

ABN , First Publish Date - 2022-01-20T16:12:10+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ డిమాండ్‌ వచ్చినా కరెంట్‌ సరఫరా చేసేలా సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.

గ్రేటర్‌లో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌

త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభం: మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ డిమాండ్‌ వచ్చినా కరెంట్‌ సరఫరా చేసేలా సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ విద్యుత్‌ అవసరాల కోసం రాయదుర్గంలో ట్రాన్స్‌కో నిర్మిస్తోన్న 400 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌  సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. రూ.1400 కోట్లతో ట్రాన్స్‌కో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తోంది. దీన్ని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రాబోయే 30, 40 ఏళ్ల విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపట్టామని మంత్రి ప్రకటించారు. 

Updated Date - 2022-01-20T16:12:10+05:30 IST