పోలీసు కుటుంబాలకు గ్యాస్‌ డోర్‌ డెలివరీ

ABN , First Publish Date - 2021-09-17T06:34:50+05:30 IST

జిల్లా పో లీసుశాఖ పరిధిలో పనిచేస్తు న్న ఉద్యోగుల కుటుంబ స భ్యులకు గ్యాస్‌ డోర్‌ డెలివరీ సదుపాయం కల్పించామని జిల్లా అదనపు ఎస్పీ నాగేం ద్రుడు పేర్కొన్నారు.

పోలీసు కుటుంబాలకు గ్యాస్‌ డోర్‌ డెలివరీ
ప్రారంభిస్తున్న అదనపు ఎస్పీ నాగేంద్రుడు


అనంతపురం క్రైం, సెప్టెంబరు 16 : జిల్లా పో లీసుశాఖ పరిధిలో పనిచేస్తు న్న ఉద్యోగుల కుటుంబ స భ్యులకు గ్యాస్‌ డోర్‌ డెలివరీ సదుపాయం కల్పించామని జిల్లా అదనపు ఎస్పీ నాగేం ద్రుడు పేర్కొన్నారు. పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీ సు కుటుంబ సభ్యులకు ఇం టి వద్దకే గ్యాస్‌ అందించే కా ర్యక్రమాన్ని ఆయన గురువా రం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించి మాట్లాడారు. మైత్రీ పోలీసు గ్యాస్‌ పేరుతో ప్రత్యేక వాహనం ద్వారా నగరంలోని పోలీసు కుటుంబ సభ్యులకు గ్యాస్‌ను ఇంటి వద్దకే (డోర్‌ డెలివరీ) పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పోలీసు కుటుంబ సభ్యులు ఈ సేవలను వినియోగించుకో వాలన్నారు. అలాగే పోలీసు సంక్షేమ కార్యక్రమాలను సద్వి నియోగం చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు నారాయణ, శ్రీశైలరెడ్డి, హరిక్రిష్ణ, శివరాముడు, జి ల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, ఏఆర్‌ ఎస్‌ఐ నీలకంఠ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-17T06:34:50+05:30 IST