Floridaలో ఉంటున్న భారతీయులకు శుభవార్త.. కొత్తగా అమల్లోకి రాబోయే చట్టంతో అవన్నీ Tax free

ABN , First Publish Date - 2022-05-08T00:47:40+05:30 IST

ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Floridaలో ఉంటున్న భారతీయులకు శుభవార్త.. కొత్తగా అమల్లోకి రాబోయే చట్టంతో అవన్నీ Tax free

ఎన్నారై డెస్క్: ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త చట్టం ద్వారా ట్యాక్స్ హాలిడేలను ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం.. ప్రభుత్వం పేర్కొన్న రోజుల్లో కొన్ని వస్తువులపై ఏరకమైన పన్నూ ఉండదు. దీంతో.. వాటి ధరలు గణనీయంగా తగ్గి ప్రజలకు ధరల భారం నుండి ఉపశమనం లభిస్తుంది. గత 40 ఏళ్లలో ఫ్లోరిడా రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడని స్థాయిలో పన్నుల భారం తగ్గనుందని ఆ రాష్ట్ర గవర్నర్ రాన్ డిశాంటిస్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 1.2 మిలియన్ డాలర్లను కేటాయించిందని తెలిపారు.  


ఇక కొత్త చట్టం ప్రకారం.. రాబోయే నెలల్లో ఇంధనంతో సహా అనేక నిత్యావసర వస్తువులను ప్రజలు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆక్టోబర్ నెల మొత్తం ఇంధనంపై ఎటువంటి ట్యాక్స్‌ను ప్రభుత్వం విధించదు. చిన్నారుల స్కూల్ పుస్తకాలు, బ్యాగులు, డైపర్లు, తుఫాను సమయాల్లో వినియోగించే రక్షణ పరికరాలు వంటి వాటికి ఈ ట్యాక్స్ హాలిడేల పరిధిలోకి రానున్నాయి. ‘‘ఇకపై ముఖ్యమైన అవసరాల కోసం కుటుంబాలు డబ్బులు పొదుపు చేయగలవు’’ అంటూ గవర్నర్ డిశాంటిస్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఫ్లోరిడాలోని భారతీయులకూ ధరల మంట నుంచి ఉపశమనం కలగనుంది. 



Read more