గ్యాస్‌ డెలివరీ సిబ్బంది రిలే దీక్ష

ABN , First Publish Date - 2022-06-30T05:22:30+05:30 IST

దశిక గ్యాస్‌ ఏజెన్సీ యాజమాన్యం తొలగించిన ఏడుగురు డెలివరీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో నివధిక సమ్మె చేపడతామని గ్యాస్‌ డెలివరీ సిబ్బంది, వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయు) కార్యదర్శి బి వాసుదేవరావు హెచ్చరించారు.

గ్యాస్‌ డెలివరీ సిబ్బంది రిలే దీక్ష
సమ్మె చేస్తున్న గ్యాస్‌ డెలివరీ సిబ్బంది

భీమవరం అర్బన్‌, జూన్‌ 29: దశిక గ్యాస్‌ ఏజెన్సీ యాజమాన్యం తొలగించిన ఏడుగురు డెలివరీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో నివధిక సమ్మె చేపడతామని గ్యాస్‌ డెలివరీ సిబ్బంది, వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయు) కార్యదర్శి బి వాసుదేవరావు హెచ్చరించారు. దశిక ఏజెన్సీ కార్యాలయం వద్ద బుధవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. యూనియన్‌లో చేరిన కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. డెలివరీ బాయ్స్‌ పమిడి లక్ష్మణరావు, మల్ల రామకృష్ణ, చదరం రాము, పోలంకి ధనరాజు, నక్క నాగరాజు, రాంబాబు, బి.సీతారామయ్య, ఎస్‌ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:22:30+05:30 IST