TTA Mega Convention.. అమెరికాకు తెలంగాణ తల్లి విగ్రహం

ABN , First Publish Date - 2022-05-18T23:34:28+05:30 IST

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఈ నెల 27-29 తేదీల మధ్య న్యూజెర్సీలో మెగా కన్వెన్షన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే రకరకాల కార్యక్రమాలకు తెలంగాణ అమెరికన్ తెలుగు అ

TTA Mega Convention.. అమెరికాకు తెలంగాణ తల్లి విగ్రహం

ఎన్నారై డెస్క్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఈ నెల 27-29 తేదీల మధ్య న్యూజెర్సీలో మెగా కన్వెన్షన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే రకరకాల కార్యక్రమాలకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ శ్రీకారం చుట్టింది. బిజినెస్ సెమినార్లు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని ఓ శిల్పి వద్ద 15 అడుగుల చార్మినార్, 18అడుగుల ఓరుగల్లు స్తూపం, 6 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆర్డర్ చేసింది. వీటి తయారీ ప్రస్తుతం పూర్తవగా.. కొరియర్ సంస్థ గరుడవేగ ఈ విగ్రహాలను అమెరికా తరలిస్తోంది. టీటీఏ నిర్వహిస్తున్న కన్వెన్షన్‌కు తమ సంస్థ ద్వారా విగ్రహాలను పంపడం ఆనందంగా ఉందని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మూడు విగ్రహాల బరువు సుమారు 2.5 టన్నులుండగా.. విగ్రహాల భాగాలను 22 బాక్సుల్లో అమెరికాకు పంపినట్లు పేర్కొన్నారు.  కాగా.. ఈ కార్యక్రమంలో అమెరికాలోని వేలాది మంది ఎన్నారైలతోపాటు తెలంగాణ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొంటున్నట్లు సమాచారం.




Updated Date - 2022-05-18T23:34:28+05:30 IST