Abn logo
Mar 2 2021 @ 21:20PM

గరుడవాహనంపై శ్రీవారికి గ్రామోత్సవం

గూడూరురూరల్‌, మార్చి 2: స్థానిక సంగం ఽథియేటర్‌ సమీపంలోని ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం  స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. ఉదయం మహాసుదర్శనహోమం నిర్వహించారు. ఉభయదాతలుగా చేడిమాల రామకృష్ణస్వరూప్‌, సంగీతలక్ష్మిలు వ్యవహరించారు. సాయంత్రం స్వామివారిని గరుడవాహనంపై అలంకరించి గ్రామోత్సవం జరిపారు. ఉభయదాతలుగా నందిమండలం రవీంద్రరాజు, శ్రీకళ వ్యవహరించారు. 


Advertisement
Advertisement
Advertisement