GRSEలో ప్రీ సీ ట్రెయినింగ్‌

ABN , First Publish Date - 2022-08-10T21:11:59+05:30 IST

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(Garden Reach Shipbuilders and Engineers Ltd) (జీఆర్‌ఎస్‌ఈ)కి చెందిన టెక్నికల్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌ - ప్రీ సీ ట్రెయినింగ్‌ కోర్సు (టీఎంఈ/ జీఎంఈ) సెప్టెంబరు సెషన్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు వ్యవధి

GRSEలో ప్రీ సీ ట్రెయినింగ్‌

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(Garden Reach Shipbuilders and Engineers Ltd) (జీఆర్‌ఎస్‌ఈ)కి చెందిన టెక్నికల్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌ - ప్రీ సీ ట్రెయినింగ్‌ కోర్సు (టీఎంఈ/ జీఎంఈ) సెప్టెంబరు సెషన్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు వ్యవధి ఏడాది. ఈ కోర్సులో మొత్తం 50 సీట్లు ఉన్నాయి. దీనికి ముంబైలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌ గుర్తింపు ఉంది.  ఇది నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. పూర్తి సమాచారం కోసం ఆగస్టు 6 నాటి ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ చూడవచ్చు.   


అర్హత: ఏఐసీటీఈ/ యూజీసి గుర్తింపు పొందిన కళాశాల నుంచి డిగ్రీ(మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ మెకానికల్‌ అండ్‌ ఆటొమేషన్‌ ఇంజనీరింగ్‌/ మెరైన్‌ ఇంజనీరింగ్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో చివరి ఏడాది కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.  పదోతరగతి/ ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌లో కనీసం ద్వితీయ శ్రేణి మార్కులు ఉండాలి. శాండ్‌విచ్‌ కోర్సులను అనుమతించరు. అభ్యర్థుల వయసు కోర్సు ప్రారంభం నాటికి 28 ఏళ్లు మించకూడదు.    


ఎంపిక: ఇంజనీరింగ్‌ డిగ్రీ చివరి ఏడాది వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. ఈ లిస్ట్‌ ప్రకారం డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి అడ్మిషన్‌ ఖరారు చేస్తారు. 


ముఖ్య సమాచారం

ప్రోగ్రామ్‌ ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1,82,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,72,900

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 4

వెబ్‌సైట్‌: www.grse.in

Updated Date - 2022-08-10T21:11:59+05:30 IST