Advertisement
Advertisement
Abn logo
Advertisement

గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని దీక్ష

పాలకోడేరు, నవంబరు 26 : గరగపర్రులో వివాదాస్పదంగా ఉన్న   అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితులకు రావాల్సిన నష్టపరిహారాన్ని త్వరితగతిన అందించాలని జాతీయ దళిత నాయకుడు గొల్లమూడి రాజాసుందరబాబు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని దళిత నాయకుల ఆధ్వర్యంలో గరగపర్రు చినపేట వద్ద దళితులు రిలే దీక్షలు చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ చేశారు. మూ డేళ్ల కిందటి అంబేడ్కర్‌ విగ్రహ సమస్యను ప్రభుత్వం ఇంకా పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. రిలే నిరాహార దీక్షలు 15 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. గరగపర్రులో రిలే దీక్షలు చేస్తున్న దళితుల వద్దకు తహసీ ల్దార్‌ మధుసూదనరావు వెళ్లి మాట్లాడారు. దళిత నాయకుడు సిరింగుల వెంకటరత్నం,చింతపల్లి గురుప్రసాద్‌, పొన్నమండ బాలకృష్ణ, దుండి అశోక్‌, కోరం ముసలయ్య మాట్లాడుతూ 15 రోజుల్లోపు సమస్యను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. 

Advertisement
Advertisement