గప్టిల్‌కు గాయం

ABN , First Publish Date - 2021-10-28T09:11:17+05:30 IST

గాయపడిన న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ భారత్‌తో మ్యాచ్‌కు బరిలో దిగేది అనుమానంగా ఉంది. పాకిస్థాన్‌తో మంగళవారం ...

గప్టిల్‌కు గాయం

 భారత్‌తో మ్యాచ్‌కు డౌట్‌

షార్జా:  గాయపడిన న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ భారత్‌తో మ్యాచ్‌కు బరిలో దిగేది అనుమానంగా ఉంది. పాకిస్థాన్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో హారిస్‌ రౌఫ్‌ బంతి తగిలి గప్టిల్‌ కాలి వేలికి గాయమైంది. రాబోయే రెండు రోజుల్లో గప్టిల్‌ కోలుకోవడంపై అతడు భారత్‌తో మ్యాచ్‌లో ఆడేది లేనిదీ ఆధారపడి ఉంటుందని కివీస్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ బుధవారం తెలిపాడు. టీమిండియా-న్యూజిలాండ్‌ మధ్య గ్రూప్‌-2 మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. 

Updated Date - 2021-10-28T09:11:17+05:30 IST