విశాఖపట్నం (Visakha): వంగవీటి మోహనరంగా (Mohana Ranga) 75వ జయంతి వేడుకలు కాపు నేత, గాదే బాలాజీ ఆధ్వర్యంలో విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగా, ఒక కులానికి ఒక వర్గానికి చెందిన వారు కాదని, అందరివాడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుతున్నారన్నారు. కాపులు ఎప్పుడూ ఐక్యంగానే ఉన్నారని, రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నారన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసే ఉన్నారు కాబట్టి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించనవసరం లేదని ఇప్పటికే బీజేపీ చెప్పిందన్నారు. చిరంజీవి, గతంలో పర్యాటక శాఖ మంత్రిగా, పని చేశారు కాబట్టి ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారన్నారు. ప్రతిపక్షంగా టీడీపీని కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిందని గంటా శ్రీనివాసరావు అన్నారు.
ఇవి కూడా చదవండి