Abn logo
Mar 4 2021 @ 03:26AM

ఇది వైసీపీ మైండ్‌గేమ్‌

ఆ ప్రతిపాదనలేంటో సాయిరెడ్డి బయటపెట్టాలి: గంటా


విజయసాయిరెడ్డి ప్రకటనను మైండ్‌గేమ్‌గా గంటా శ్రీనివాసరావు అభివర్ణించారు. ఐదు రోజుల్లో విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న సమయంలో విజయసాయిరెడ్డి ఇలా ప్రకటించడం మైండ్‌గేమేనని విలేకరులతో అన్నారు. 2021 ప్రారంభం నుంచి టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నానని, జీవీఎంసీ ఎన్నికలకు కార్పొరేటర్‌ అభ్యర్థులను ఎంపిక చేశానని, వార్డుల్లో ప్రచారం కూడా చేపట్టామని తెలిపారు. 2019 ఎన్నికల ముందు, ఆ తరువాత కూడా తాను పార్టీ మారతానని పుకార్లు వచ్చాయని వివరించారు. జగన్‌ పరిశీలనలోని ఆ ప్రతిపాదనలు ఏమిటో విజయసాయిరెడ్డినే అడగాలన్నారు. తాజాగా వైసీపీలో చేరిన కాశీ విశ్వనాథం తనకు ముఖ్యమైన అనుచరుడేనని, రెండేళ్లుగా చాలా ఇబ్బందులు పడుతున్నాడని, అనుమతులున్నా ఆయన గోకార్టింగ్‌ను కూల్చేశారని గుర్తుచేశారు. 

Advertisement
Advertisement
Advertisement