సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేత గంటా లింగన్న మృతి

ABN , First Publish Date - 2022-01-20T01:51:45+05:30 IST

కొండాపురం మండలం శాయిపేటకు చెందిన సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేత గంటా లింగన్న అలియాస్‌ మూర్తి గుండెపోటుకు గురై పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేత గంటా లింగన్న మృతి
గంటా లింగన్న (ఫైల్‌)

కావలిటౌన్‌, జనవరి 19: కొండాపురం మండలం శాయిపేటకు చెందిన సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేత గంటా లింగన్న అలియాస్‌ మూర్తి గుండెపోటుకు గురై పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు వామపక్ష నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ నేత కరవది భాస్కర్‌ మాట్లాడుతూ లింగన్న నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. కావలి జేబీ విఫ్లవ విద్యార్థి ఉద్యమానికి కొండంత అండగా నిలిచారన్నారు. గోదావరి లోయ విస్తరణ ఉద్యమంలో పాల్గొని ఎన్‌కౌంటర్‌లో తుపాకీ తూటాలు తగిలి గాయపడ్డారని, అయినా పేద ప్రజల విముక్తి పట్ల అంచలంచల విశ్వాసం, నిబద్ధతతో పోరాటం చేశారన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దామా అంకయ్య, డేగా సత్యం, గంటా నరసింహులు తదితరులు నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లింగన్న మృతి కమ్యూనిష్టు ఉద్యమానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-20T01:51:45+05:30 IST