అమరావతి: సీఎం జగన్ దగ్గరకు గన్నవరం (Gannavaram) వైసీపీ పంచాయితీ చేరింది. సీఎంవో నుంచి ఎమ్మెల్యే వంశీ (Vamsi), దుట్టా రామచంద్రరావుకు పిలుపు వచ్చింది. కొన్నిరోజులుగా వంశీ, దుట్టా వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. తారస్థాయికి చేరినందున వ్యవహారంపై వైసీపీ అధిష్టానం దృష్టిసారించింది. నియోజకవర్గంలో పరిస్థితి చక్కదిద్దేందుకు కాసేపట్లో ఇరువురితో భేటీ కానున్నారు. పార్టీ కార్యకర్తల సస్పెన్షన్లు, అక్రమ తవ్వకాల వ్యవహారాలపై ప్రశ్నించేందుకు దుట్టా రామచంద్రరావు సిద్ధమైనట్లు సమాచారం. మరోసారి ఆసక్తికరంగా గన్నవరం రాజకీయం మారింది. గన్నవరంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరేనా?.. జగన్‌తో భేటీ తర్వాత రెండువర్గాలు కలిసి పని చేస్తాయా?.. వంశీ, దుట్టా మధ్య సయోధ్య కుదిరితే యార్లగడ్డ పరిస్థితేంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి