Gannavaram airportలో స్పైస్ జెట్ విమానాలు రద్దు

ABN , First Publish Date - 2021-08-20T17:08:16+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానాలు రద్దు అయ్యాయి.

Gannavaram airportలో స్పైస్ జెట్ విమానాలు రద్దు

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానాలు రద్దు అయ్యాయి. 30% కూడా ప్రయాణికుల సంఖ్య బుకింగ్ కాని పరిస్థితి నెలకొంది. ఇలాగైతే విమాన సర్వీసులు నడపలేమని స్పైస్ జెట్ యాజమాన్యం తేల్చిచెప్పింది. ఈ క్రమంలో ఆన్లైన్ బుకింగ్‌లను స్పైస్ సంస్థ నిలిపివేసింది. దాదాపు రెండు నెలల పాటు విమానాల సర్వీసులను  స్పైస్ జెట్ సంస్థ నిలిపివేసింది. బెంగుళూరు,హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు నడిపే స్పైస్ జెట్ విమానాలు రద్దవడంతో గన్నవరం విమానాశ్రయం ఒక్కసారిగా ఖాళీ అయింది. గత ప్రభుత్వంలో స్పైస్ జెట్ విమానాల్లో 80%పైగా బుకింగ్‌లు ఉండగా... ఒక్కసారిగా 30 శాతానికి బుకింగ్‌లు తగ్గిపోయాయి. గన్నవరం విమానాశ్రయం రన్ వే పెరిగినప్పటికీ... సర్వీసులు తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-08-20T17:08:16+05:30 IST