52 కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-10-29T05:18:47+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో 52 కేజీల గంజాయిని విడివిడిగా తీసుకెళ్తున్న వ్యక్తులను నెల్లూరు సెబ్‌ -2 (రూరల్‌ సర్కిల్‌) పోలీసులు గురువారం వేకువజామున పట్టుకున్నారు.

52 కేజీల గంజాయి పట్టివేత
పట్టుబడ్డ నిందితుడితో సెబ్‌ పోలీసులు

నర్సీపట్నం, రాజమండ్రి నుంచి కేరళ, తిరుపతికి రవాణా 

నెల్లూరు రూరల్‌, అక్టోబరు 28 : ఆర్టీసీ బస్సుల్లో 52 కేజీల గంజాయిని విడివిడిగా తీసుకెళ్తున్న వ్యక్తులను నెల్లూరు సెబ్‌ -2 (రూరల్‌ సర్కిల్‌) పోలీసులు గురువారం వేకువజామున పట్టుకున్నారు. ఆ వివరాలను ఎక్సైజ్‌ శాఖ ఈఎస్‌ రవికుమార్‌, ఏఈఎస్‌ కృష్ణకిషోర్‌రెడ్డి సెబ్‌ - 2 పోలీసు స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. కేరళకు చెందిన మహ్మద్‌ నహప్‌ పడిందరెట్టి రాజమండ్రి నుంచి 32 కేజీల గంజాయితో కేరళకు ప్రయాణిస్తుండగా వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా పట్టుకున్నట్లు చెప్పారు. మరో బస్సులో నర్సీపట్నం నుంచి తిరుపతికి 20 కేజీల గంజాయిని తీసుకెళ్తున్న జల్లి దేవిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సెబ్‌ - 2 సీఐ వెంకటేశ్వరరావుతోపాటు సిబ్బంది పాల్గొన్నారన్నారు. 

Updated Date - 2021-10-29T05:18:47+05:30 IST