స్వాధీనపర్చుకున్న గంజాయి ప్యాకెట్ల తో ఎస్‌ఐ చక్రధర్, సిబ్బంది
లారీలో తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు
యూపీకి చెందిన ఇద్దరు నిందితుల అరెస్టు
ఎస్.రాయవరం, నవంబరు 29 : మండలంలోని గోకులపాడు హైవే జంక్షన్ వద్ద ఎస్‌ఐ చక్రధర్ ఆదివారం భారీగా గం జాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గోకులపాడు హైవే వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతలో అటుగా వస్తున్న ఓ లారీలో 820 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ చెప్పారు. లారీని సీజ్ చేసి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీతల్‌ప్రసాద్, గయాదిన్‌లను అరెస్టు చేశామన్నారు.