Jun 5 2021 @ 10:20AM

జులై నుంచి 'గని' కొత్త షెడ్యూల్​..?

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'గని'. జూలై నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తాజా సమాచారం. బాక్సింగ్‌ క్రీడా నేపథ్యంలో వరుణ్ తేజ్ 10వ చిత్రంగా 'గని' తెరకెక్కుతుండగా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కాగా కొత్త షెడ్యూల్‌ జులై నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్‌తో కలిసి వరుణ్ తేజ్ 'ఎఫ్ 3'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత.