Aug 6 2021 @ 01:53AM

దీపావళికి గని

వరుణ్‌తేజ్‌ హీరోగా అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న సినిమా ‘గని’. దీపావళి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేలా సినిమా ఉంటుంది. బాక్సర్‌గా, టైటిల్‌ పాత్రలో పర్‌ఫెక్ట్‌గా కనిపించడం కోసం వరుణ్‌తేజ్‌ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. కరోనా రెండో దశ తర్వాత సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ చేస్తున్నాం. అందులో ఫైనల్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. ప్లాన్‌ ప్రకారం చిత్రీకరణ పూర్తవుతుంది. దీపావళికి భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా... ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీత దర్శకుడు.