అలాంటి వాటికి బదులివ్వాల్సిన అవసరం లేదు

ABN , First Publish Date - 2022-02-04T05:30:00+05:30 IST

బీసీసీఐ అధ్యక్షుడు ఎలా పనిచేయాలో అలాగే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని సౌరవ్‌ గంగూలీ స్పష్టంజేశాడు. సెలెక్టర్లపై తాను ఒత్తిడి తెస్తున్నా నన్న ఆరోపణలను కొట్టిపడేశాడు...

అలాంటి వాటికి బదులివ్వాల్సిన అవసరం లేదు

నా బాధ్యత నిర్వర్తిస్తున్నా

సెలెక్టర్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలపై గంగూలీ


న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు ఎలా పనిచేయాలో అలాగే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని సౌరవ్‌ గంగూలీ స్పష్టంజేశాడు. సెలెక్టర్లపై తాను ఒత్తిడి తెస్తున్నా నన్న ఆరోపణలను కొట్టిపడేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన తాను, బీసీసీఐ కార్యదర్శి జై షా, సంయుక్త కార్యదర్శి జయేష్‌ జార్జ్‌, విరాట్‌ కోహ్లీ కలిసి కూర్చున్న ఫొటో..సెలెక్షన్‌ కమిటీ భేటీది కాదని సౌరవ్‌ తెలిపాడు. ఇక..కార్యదర్శి జే షా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పాడు. టీమిండియా టెస్ట్‌ కొత్త కెప్టెన్‌పై బోర్డు ఆఫీసు బేరర్లతో చర్చించిన మీదట సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపాడు. గాయపడిన హార్దిక్‌ పాండ్యా పూర్తిగా కోలుకొనేందుకే తగిన సమయం ఇవ్వాలని భావించామన్నాడు. శ్రీలంకతో సిరీ్‌సకు ముందే రంజీట్రోఫీ జరుగుతున్నందున రహానె, పూజార అందులో ఆడాలన్నది తన ఆలోచనగా తెలిపాడు. ఈసారి ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నామన్నాడు. దేశంలో కొవిడ్‌ పరిస్థితులను గమనిస్తున్నందున దానిని అధికారికంగా ప్రకటించలేదని చెప్పాడు. 


2023లో పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్‌: వచ్చే ఏడాది పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తున్నామని దాదా తెలిపాడు. ఇక.. వెస్టిండీ్‌సతో తొలి వన్డే భారత్‌కు 1000వ మ్యాచ్‌ అయినా కొవిడ్‌ వల్ల ప్రత్యేక కార్యక్రమాలేవీ నిర్వహించడంలేదని చెప్పాడు. ఇక, విండీ స్‌తో కోల్‌కతాలో జరిగే మూడు టీ20లకు అభిమానులను స్టేడియంలోకి అనుమతించడంలేదని సౌరవ్‌ స్పష్టంజేశాడు. 

Updated Date - 2022-02-04T05:30:00+05:30 IST