కరీంనగర్ : కేంద్రం ధాన్యం కొనకపోతే మీరు కొంటారా లేదా అని మంత్రి గంగుల కమలాకర్ను ఓ రైతు ప్రశ్నించాడు. నేడు కరీంనగర్, గోపాల్పూర్ స్టేజ్ వద్ద టీఆర్ఎస్ నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో గంగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ రైతు ధాన్యం కొనుగోలు విషయమై ప్రశ్నించగా.. కేంద్రం చేతులు ఎత్తేశాక చూద్దామని సమాధానమిచ్చారు. కేంద్రంతో సంబంధం లేకుండా ధాన్యం కొనాలని రైతు కోరారు. సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారని గంగుల సమాధానమిచ్చారు. కేంద్రంపై ముందుగా ఒత్తిడి తెద్దామని గంగుల సర్ది చెప్పారు.