Gangula Kamalakar: నిర్మల సీతారామన్‌ది దిగజారుడు రాజకీయం: గంగుల కమలాకర్

ABN , First Publish Date - 2022-09-06T20:56:03+05:30 IST

నిర్మల సీతారామన్ రేషన్ షాపులకు వెళ్లడం దిగజారుడు రాజకీయమని మంత్రి గంగుల విమర్శించారు.

Gangula Kamalakar: నిర్మల సీతారామన్‌ది దిగజారుడు రాజకీయం: గంగుల కమలాకర్

హైదరాబాద్ (Hyderabad): కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Seetharaman) రేషన్ షాపు (Ration Shops)లకు వెళ్ళడం దిగజారుడు రాజకీయమని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం మంత్రి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్‌ (Chit chat)గా మాట్లాడారు. ఫోటోలే పెట్టాల్సి వస్తే గుజరాత్ అంతా  సీఎం కేసీఆర్ (CM KCR) ఫోటో పెట్టాలన్నారు. దేశానికి అత్యధికంగా జీఎస్టీ (GST) కట్టేది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. అదానీకి పెట్టిన డబ్బులన్నీ తెలంగాణ (Telangana) ప్రజల రక్తమని అన్నారు. రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఫోటో పెట్టాలనే రూల్ ఏమీ లేదన్నారు. కేంద్ర మంత్రికి వివరాలు కావాలంటే సీఎస్‌తో రివ్యూ చేయాలన్నారు. నిర్మల సీతారామన్ డైరెక్ట్‌గా రేషన్ షాపులకు వెళ్ళడం దిగజారడమేనని గంగుల కమలాకర్ మరోసారి విమర్శించారు.

Updated Date - 2022-09-06T20:56:03+05:30 IST