Abn logo
Jul 24 2021 @ 21:39PM

హుజురాబాద్ మోటార్ మెకానిక్‌లకు 3 ఎకరాల భూమి

కరీంనగర్: హుజురాబాద్ మోటార్ మెకానిక్‌లకు ఆటోనగర్ కోసం 3 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రి గంగుల కమలాకర్ప్రొ సీడింగ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘నేను ఆవులాంటి వాడిని. దానా ఎక్కువేస్తే ఎక్కువ పాలిస్తా. దున్నపోతుకు గడ్డేసి బర్రె‌కి పాలు పిండితే తన్నుతది. ఓట్లు ఎక్కువ వేస్తే ఎక్కువ పాలిస్తా.’’ అని వ్యాఖ్యానించారు.ఈ ఎన్నికలతో ప్రధాని, సీఎంలు దిగిపోరన్నారు. ఈటల గెలుస్తే రాజసింగ్, రఘునందన్‌ల పక్కన ఉంటాడు. ఈటల గెలిస్తే ఒక్కడే గెలుస్తాడన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు గెలుస్తారని చెప్పారు.