Abn logo
Jun 22 2021 @ 16:51PM

కరీంనగర్ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ: గంగుల

అమరావతి: జలసౌధలో ఇరిగేషన్, టూరిజం అధికారులతో మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. 410 కోట్లతో సుందరంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. జూలై నెలాఖరు కల్లా డీపీఆర్, ఆగస్టు నుండి పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్ డిజైన్ల కోసం టెండర్లు పిలిచామన్నారు.