Abn logo
Jul 11 2020 @ 19:39PM

నన్నూ ఎన్‌కౌంటర్ చేస్తారేమో.. కోర్టుకెక్కిన గ్యాంగ్‌స్టర్!

చండీగఢ్: తనను నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారంటూ కోర్టుకెక్కాడు ఓ గ్యాంగ్‌స్టర్. ఈ ఘటన హరియాణాలోని చండీగఢ్‌లో జరిగింది. లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.  అతని నేరాలపై విచారణ జరుగుతోంది. ఇటీవల జరిగిన యూపీ గ్యాంగ్‌స్టర్ దూబే ఎన్‌కౌంటర్ భయంతో లారెన్స్ వణికిపోతున్నాడు. తనను కూడా పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేసే ప్రమాదం ఉందంటూ చండీగఢ్ కోర్టును ఆశ్రయించాడు. పంజాబ్, రాజస్థాన్‌లో చాలా నేరాలకు పాల్పడిన లారెన్స్.. తనను కోర్టుకు తెచ్చేప్పుడైనా, ఎక్కడకు వెళ్లేప్పుడైనా బేడీలు వేయాల్సిందిగా కోరాడు. తద్వారా తనను ఎన్‌కౌంటర్ చేసే అవకాశాలు తగ్గుతాయని లారెన్స్ అభిప్రాయం.

Advertisement