Gangrape case .. బాలిక ఒంటిపై తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-06-10T20:59:06+05:30 IST

బాలికపై గ్యాంగ్‌రేప్‌ కేసు (Gangrape case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ పోలీసుల చేతిలో బాలిక మెడికల్ రిపోర్ట్ వచ్చింది.

Gangrape case .. బాలిక ఒంటిపై తీవ్రగాయాలు

హైదరాబాద్‌: బాలికపై గ్యాంగ్‌రేప్‌ కేసు (Gangrape case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ పోలీసుల చేతిలో బాలిక మెడికల్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టు ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై నిందితులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఇన్నోవాలో ఆమెపై నిందితులు అసభ్యంగా ప్రవర్తించారు. బాలిక నిరాకరించడంతో గోళ్లతో దాడి చేశారు. బాలిక ఒంటిపై 12 తీవ్రగాయాలున్నట్లు వైద్యుల నిర్ధారించారు. బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఇప్పటివరకు సాదుద్దీన్‌ సహా.. ఐదుగురు మైనర్లను అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారని, ఒక మైనర్‌ పాత్ర కేవలం సహకారం వరకేనని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు(ఏ1)గా ఉన్న సాదుద్దీన్‌ మలిక్‌ను పోలీసులు గురువారం ఉదయం కస్టడీకి తీసుకున్నారు. అదనపు డీసీపీ ఇక్బాల్‌ సిద్ధికీ, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ అతణ్ని 5 గంటల పాటు ప్రశ్నించారు. సాదుద్దీన్‌ తొలుత తాము బేకరీ వరకు వెళ్లి.. పబ్‌కు తిరిగివచ్చామంటూ తికమకపెట్టేందుకు ప్రయత్నించాడు. సాదుద్దీన్‌ను 2వ రోజు పోలీసులు విచారిస్తోన్నారు. కాసేపట్లో జువైనల్ హోంలో మైనర్లను పోలీసులు విచారించనున్నారు. ముగ్గురు మైనర్ల స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు.

Updated Date - 2022-06-10T20:59:06+05:30 IST