రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రామ్ చరణ్ భార్య సీత పాత్రను బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ట్రెడిషనల్ లుక్ లో ఆలియా ఆకట్టుకోనుంది. జనవరి 7న విడుదల కావాల్సిన ఈసినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాని కారణంగా చాలా సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో సంజయ్ లీలా భన్సాలీ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘గంగూబాయ్ ఖతియావాడి’ ఒకటి. ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను డా.జయంతీలాల్ గద, భన్సాలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇదొక బయోగ్రాఫికల్ మూవీ. హుస్సైన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముంబైలోని ఖతియావాడ్ ప్రాంతానికి చెందిన గంగా హర్జీవన్ దాస్ జీవిత కథగా ఈసినిమా తెరకెక్కింది. రెడ్ లైట్ ఏరియాలోని కామటిపురకి ఆమె మేడమ్ గా.. గంగా నుంచి గంగూబాయ్ గా ఎలా మారింది, అనేదే ‘గంగూబాయ్ ఖతియావాడి’ చిత్ర కథాంశం. శాంతను మహేశ్వరి, విజయ్ రాజ్, సీమా భార్గవ పావా, ఇందిరా తివారీ, వరుణ్ కపూర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవ్ గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.