బెంగళూరు: దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మైసూరు గ్యాంగ్‌రేప్ కేసును మూసివేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. విధాన పరిషత్‌లో ప్రతిపక్షనేత ఎస్ఆర్ పాటిల్ 59వ నిబంధన కింద రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అంశాన్ని ప్రస్తావించారు. మైసూరులో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి నిందితులను అరెస్టు చే యడం మినహా ఇంతవరకు ఎలాంటి ప్రగతి కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన విరుచుకుపడ్డారు. ఇంతవరకు అ త్యాచారానికి గురైన యువతి వాంగ్మూలాన్ని తీసుకోలేదని, నిందితులపై దాఖలైన సెక్షన్లు బలహీనంగా ఉన్నాయన్నారు. ఈ అంశంపై చర్చకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సభా నాయకుడు కోట శ్రీనివాసపూజారి జోక్యం చేసుకుంటూ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితులందరినీ పట్టివేశామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.