మోటారు పంపుసెట్ల దొంగతనాల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-01-14T04:22:23+05:30 IST

తాడ్వాయి మండలంలో గత నెల రోజులుగా వ్యవసాయ మోటార్‌ పంపుసెట్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను గురువారం తాడ్వాయి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

మోటారు పంపుసెట్ల దొంగతనాల ముఠా అరెస్టు
కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

18 వ్యవసాయ పంపుసెట్లు, 39వేల నగదు, ఆటో, మోటారు సైకిల్‌ స్వాధీనం

7 కేసుల్లో ముగ్గురి అరెస్టు, రిమాండ్‌

ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

కామారెడ్డి, జనవరి 13: తాడ్వాయి మండలంలో గత నెల రోజులుగా వ్యవసాయ మోటార్‌ పంపుసెట్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను గురువారం తాడ్వాయి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ మోటార్‌ పంపుసెట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈనెల 11న తెల్లవారు జామున తాడ్వా యి మండల కేంద్రంలో ఎస్‌ఐ కృష్ణమూర్తి ఆధ్వర్య ంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఎర్రాపహాడ్‌ గ్రామ శివారులో అనుమానాస్పదంగా ఒక ఆటో, ఒక మోటార్‌ సైకిల్‌పై వస్తున్న వారిని గమనించి తన టీం సహాయంతో వారిని ఆపగా వెంటనే ఆటోలో ఉన్న వ్యక్తి, మోటార్‌ సైకిల్‌పై ఉన్న ఇద్దరు వారి వాహనాలు వదిలేసి పారిపోతుండగా ఎస్‌ఐ కృష్ణమూర్తి తన టీంతో పట్టుకుని అనుమానాస్పదంగా వెళ్తున్న వారిని విచారించగా తామే గత నెలరోజులుగా తాడ్వాయి మండలం కన్కల్‌, తాడ్వాయిలో వ్యవసాయ బోరుబావుల వద్ద మోటార్‌ పంపుసెట్లను ఆటో, మోటార్‌ సైకిల్‌లు ఉపయోగించి దొంగతనాలు చేస్తున్నట్లు అంగీకరించారు. వ్యవసాయ పంపుసెట్లను గత నెల రోజులుగా చోరీలకు పాల్పడుతూ అనుమానం రాకుండా స్ర్కాప్‌గా మార్చి వచ్చిన డబ్బులను తమ అవసరాల నిమిత్తం వాడుకుంటున్నట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. వీరిది లింగంపేట మండల కేంద్రానికి చెందిన టేకు రాజు, మోతె తండాకు చెందిన కొర్ర రవి, ఇదే తం డాకు చెందిన కొర్ర నంధ్యాలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి గత నెల రోజులుగా 28 బావుల వద్ద వ్యవసాయ మోటార్‌ పంపుసెట్లను చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుంచి 13 వ్యవసాయ పంపుసెట్ల మోటార్‌లు, 39వేల నగదు, ఆటో, మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తాడ్వాయి పోలీసులు వీరిపై 7 కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. ఒక టీంగా ఏర్పడి వ్యవసాయ పంపుసెట్ల మోటార్‌లను చోరీ చేస్తూ రైతులకు ఇబ్బందులు చేస్తున్న ముఠాను సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించినట్లు తెలిపారు. ఎంతో చాకచక్యంగా ముఠాను పట్టుకున్న పోలీసులను అభినందించడమే కాకుండా రివార్డు అం దించనున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాను నేరరహిత జిల్లాగా చేసేందుకు జిల్లా ప్రజలు ముందుకు రావాలని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గత ఏడా ది కంటే తగ్గుముఖం పట్టాయని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్‌పీ అనోన్య, డీఎస్పీ శశాంక్‌రెడ్డి, సీఐ రామన్‌, ఎస్‌ఐ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-14T04:22:23+05:30 IST