ప్రేమ, ఉద్యోగాల పేరుతో వల

ABN , First Publish Date - 2020-09-30T05:48:40+05:30 IST

ప్రేమ, ఉద్యోగాల పేరుతో యువకులను నమ్మించి లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్న ఒక ముఠాను మంగళవారం కరీంనగర్‌

ప్రేమ, ఉద్యోగాల పేరుతో వల

లక్షల్లో డబ్బు వసూలు చేసిన ముఠా అరెస్టు  


కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 29 : ప్రేమ, ఉద్యోగాల పేరుతో యువకులను నమ్మించి లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్న ఒక ముఠాను మంగళవారం కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌, ఒకటోఠాణా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... బెల్లంపల్లికి చెందిన యువతి ఎం ఎల్‌టీ చదివి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటూ కుటుంబ సభ్యులతో గొడవపడి కరీంనగర్‌లోని ఆదర్శనగర్‌లో ఒంటరిగా నివసిస్తోంది. జల్సాలకు అటవా టుపడిన ఆ యువతి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అమా యక యువకులను అక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నది.


కరీంనగర్‌లోని సిఖ్‌వాడికి చెందిన యువకుడికి వరంగల్‌లోని ప్రభుత్వ ఆసు పత్రిలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని, క్యాంటిన్‌ నిర్వహణ కాంట్రాక్టు ఇప్పిస్తానని రూ.3.50 లక్షలు వసూలు చేసింది. తిరుమల్‌నగర్‌కు చెందిన మరో యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని 7 లక్షలు, గోదావరిఖనికి చెందిన ఇంకొక యువకుడి వద్ద రూ. 3 లక్షలు తీసుకుంది.


వరంగల్‌కు చెందిన యువకుడిని మోసం చేసి రూ. 8 లక్షలు వసూలు చేసింది.ముఠాలోని ప్రధాన నిందితురాలు తాళ్ళ శ్వేత అలియాస్‌ నికితారెడ్డితో పాటు బెల్లంపల్లికి చెందిన కంబాల రాజేష్‌, కుసుమ భాస్కర్‌, భీమా శంకర్‌లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 20 వేల నగదు, నకిలీ నియామకపత్రాలు, 3 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హైదరాబాద్‌, వరంగల్‌, గోదావరిఖనిలలో కేసులు నమోదయ్యాయని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-09-30T05:48:40+05:30 IST