Abn logo
Sep 18 2021 @ 01:00AM

గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి

మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

వేములవాడ, సెప్టెంబరు 17 : గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. వేములవాడ పట్టణంలోని గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేశ్‌ నిమజ్జనోత్సవ శోభాయాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు అధికారుల సూచనలు పాటిస్తూ శోభాయాత్ర ప్రశాంతంగా జరపాలన్నారు. ఎవరూ మద్యం తాగవద్దన్నారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తరువాత లౌడ్‌ స్పీకర్లు వాడవద్దని అన్నారు. డీఎస్పీ చంద్రకాంత్‌, సీఐలు వెంకటేశ్‌, బన్సీలాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, ఎస్‌ఐలు శేఖర్‌, రామచంద్రం, అధికారులు పాల్గొన్నారు.