బడంగ్‌పేట్‌లో గణేశ్‌ లడ్డూ వేలం రద్దు

ABN , First Publish Date - 2020-08-15T09:13:21+05:30 IST

కరోనా నేపథ్యంలో బడంగ్‌పేట్‌లో గణేశ్‌ లడ్డూ వేలం రద్దు చేస్తున్నామని, దర్శనాలు, శోభాయాత్ర కూడా ఉండవని ఉత్సవ సమితి

బడంగ్‌పేట్‌లో గణేశ్‌ లడ్డూ వేలం రద్దు

దర్శనాలు, శోభాయాత్ర కూడా ఉండవు


సరూర్‌నగర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో బడంగ్‌పేట్‌లో గణేశ్‌ లడ్డూ వేలం రద్దు చేస్తున్నామని, దర్శనాలు, శోభాయాత్ర కూడా ఉండవని ఉత్సవ సమితి నిర్ణయం తీసుకుంది. స్థానిక వీరాంజనేయ భక్త సమాజం గణేశ్‌ ఉత్సవ సమితి మాజీ అధ్యక్షుడు పెద్దబావి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమై నవరాత్రుల నిర్వహణపై చర్చించారు.


కరోనా నేపథ్యంలో కేవలం ఐదు అడుగుల గణేశ్‌ ప్రతిమను మాత్రమే ప్రతిష్ఠించాలని, లడ్డూ వేలం పాటను రద్దు చేయాలని, మండపం వద్ద భక్తులకు  దర్శనాలూ కల్పించవద్దని సమావేశంలో తీర్మానించారు. నిమజ్జన శోభాయాత్ర సైతం రద్దు చేస్తున్నామని, ఎక్కడ నిమజ్జనం చేయాలన్నది అప్పటి పరిస్థితులు పోలీసుల సూచనలను బట్టి నిర్ణయిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఉత్సవ సమితి మాజీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T09:13:21+05:30 IST