Abn logo
Sep 19 2021 @ 11:36AM

అమెరికాలో ఘనంగా వినాయక నిమజ్జనం

మెరికాలోని ఫ్రీ మోంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. ఫ్రీ మోంట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త స్వర్ణ లత కట్టా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు వారు యూఎస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ కిశోర్ బుద్ధా, ట్రాన్స్ పోర్ట్ అధినేత రాకేశ్ రెడ్డి బొజ, మౌనిక రెడ్డి బొజ, ఆర్యన్ రెడ్డి బొజ, బాల్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు భాను చౌదరి, శ్రీకాంత్ యాదవ్, సాయికృష్ణ యాదవ్, సాయిమోపర్తి, ధర్మేంద్రశర్మ, అనుపమ, అశోక్ నున్న, రోహన్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి అందరిపై ఉండాలని పూజలు చేశారు. అనంతరం గణేషుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి గోల్డెన్ గేట్ బీచ్‌లో నిమజ్జనం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...