Abn logo
Sep 21 2021 @ 11:08AM

హైదరాబాద్‌లో ముగిసిన గణేష్ నిమజ్జనాలు

హైద్రాబాద్: గణేష్ నిమజ్జనాలు హైదరాబాద్‌లో ముగిశాయి. గ్రేటర్ హైద్రాబాద్‌లో చెరువులు, జీహెచ్‌ఎంసీ బేబీ పాండ్స్‌లో మొత్తం 83,186 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. వాటిలో బేబీ పాండ్స్‌లో 60 వేల 97 విగ్రహాలను నిమజ్జనం చేయగా... చెరువులలో 23,094  విగ్రహాలను నిమజ్జనం చేశారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర 303 కిలో మీటర్ల మేర సాగింది. గణేష్ నిమజ్జనం అనంతరం గ్రేటర్ వ్యాప్తంగా వ్యర్థాల చెత్తను జీహెచ్ఎంసీ తొలగించింది. 215 గణేష్ యాక్షన్ టీమ్‌లు, 8116 మంది పారిశుధ్య కార్మికులు రేయింబవళ్ళు శ్రమించి చెత్తను, వ్యర్థాలను తొలగించారు. అలాగే దోమల నివారణకు గంబుసియా చేపలను వదలడంతో పాటుగా లార్వా నివారణకు మందును వేశారు.


క్రైమ్ మరిన్ని...