రైతులు ఎందుకు రాలేదు?

ABN , First Publish Date - 2021-06-15T04:51:49+05:30 IST

రైతులు ఎందుకు రాలేదు?

రైతులు ఎందుకు రాలేదు?
గండ్ర జ్యోతి కాళ్లమీద పడ్డ సుధాకర్‌

ఏవోపై జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి ఆగ్రహం

శాయంపేట, జూన్‌ 14 : రైతులకు, ఎరువుల దుకాణాల డీలర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు రైతులు ఎందుకు రాలేదని ఏవో గంగాజమునపై జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు, ఎరువుల దుకాణాల డీలర్లకు, ప్రజా ప్రతి నిధులకు విత్తనాలు, ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులెవరూ రాకపోవడంతో ‘రైతులను పిలవలేదా.. పిలుస్తే ఎందుకు రారు. రైతులు రాకుంటే సమావేశం ఎందుకు’ అంటూ ఏవోపై మండిపడ్డారు. అనంతరం జ్యోతి మాట్లా డుతూ వర్షాకాలం పంటలను దృష్టిలో ఉంచుకొని విత్తనాలను ఎరువులను డీలర్ల అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజాప్రతినిధులు రైతులకు వ్యవసాయ అవసరాల మీద సమస్యలపై స్పందించాలని కోరారు. ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్‌, రెండు పంటలకు నీరును అందిస్తుందని తెలిపారు. ఎరువుల దుకా ణాల డీలర్లు రై తులకు నకిలీ వి త్తనాలు, ఎరువు లు అమ్మితే జైలుపాలౌతారని పరకాల ఏసీపీ శ్రీనివాస్‌ హెచ్చరించారు. ఎరువుల దుకాణాల డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మాలని, లేదంటే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివిజన్‌ హర్టికల్చర్‌ ఆఫీసర్‌ తిరుపతి, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, సర్పంచ్‌ రవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శరత్‌, మండల పార్టీ అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

‘నాకు మీరే న్యాయం చేయాలి’

‘భూమి విషయంలో ఎవరూ న్యాయం చేయడం లేదు. నాకు మీరే  న్యాయం చేయాలి’ అంటూ  మైలారంనకు చెందిన అరికిల్ల సుధాకర్‌ సోమవారం శాయంపేట పర్యటనకు వచ్చిన జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి కాళ్ల మీదపడ్డాడు. బాధితుడు సుధాకర్‌ కథనం ప్రకారం మైలారంలో తన తండ్రి చంద్రయ్య 50ఏళ్ల క్రితం ఒకరి వద్ద భూమిని కొనుగోలు చేసి తనకు ఇచ్చాడు. నాటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నాడు. తన భూమి పక్కనే ఇదే గ్రామానికి చెందిన అరికిల్ల వీరయ్యకు భూమి ఉంది. తన భూమిలో పాతిన హద్దు రాళ్లను వీరయ్య అల్లుడు అలువాల రాజుకుమార్‌ నాలుగు నెలల క్రితం పీకేశాడు. భూమిని సర్వే చేయమని మీ సేవాలో మూడు నెలల క్రితం దరఖాస్తూ చేసినా తహసీల్‌ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇటీవల పత్తి గింజలు వేయడానికి వెళ్తే వీరయ్య, అతని బంధువులు బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. స్పందించిన జడ్పీ చైర్‌పర్సన్‌ జ్యోతి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.



Updated Date - 2021-06-15T04:51:49+05:30 IST