Abn logo
Jun 22 2021 @ 01:06AM

ఘనంగా కాశీ విశ్వేశ్వరుని ఆలయ ప్రతిష్ఠ

ఆలయ ప్రతిష్ఠలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

పాల్గొన్న జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

సత్తెనపల్లి రూరల్‌, జూన్‌ 21: సత్తెనపల్లి మండలంలోని కట్టమూరులో శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, గండ్లూరులోని బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం కన్నుల పండుగగా జరిగాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో పాటు విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, విశ్రాంత జిల్లా జడ్జి మందడి చలపతిరావు, సత్తెనపల్లి రెండో అదనపు కోర్టు జడ్జి నరేంద్రరెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సుమారు 200 సంవత్సరాల చరిత్రగల ఈ ఆలయాన్ని దాతల సహకారంతో రూ.2 కోట్లతో పునఃనిర్మించారు.