గండిపేట గేట్లు మూసివేత

ABN , First Publish Date - 2021-07-26T05:00:12+05:30 IST

గండిపేట జలాశయం రెండు గేట్లను హిమాయత్‌సాగర్‌ జలాశయం రెండు గేట్లను మూసేశారు. రెండు రోజులుగా వర్షపాతం

గండిపేట గేట్లు మూసివేత

 హిమాయత్‌సాగర్‌ మూడు గేట్ల నుంచే నీళ్లు..


హైదరాబాద్‌ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గండిపేట జలాశయం రెండు గేట్లను  హిమాయత్‌సాగర్‌ రెండు గేట్లను మూసేశారు. రెండు రోజులుగా వర్షపాతం లేకపోవడంతో ఎగువ నుంచివరద నీటి ఉధృతి తగ్గింది. తగినంత ఇన్‌ ఫ్లో లేకపోవడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు గేట్లను మూసివేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.25 అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో 1,200 క్యూసెక్కులు వస్తుండగా మూడు గేట్ల ద్వారా 1,715 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌(గండిపేట) పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1785.80 అడుగుల వరకు ఉంది. ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కుల వరకు వరద నీరు చేరుతోంది. 


Updated Date - 2021-07-26T05:00:12+05:30 IST