గండికోట రిజర్వాయర్ ముంపు గ్రామస్తులను కాపాడాలి: పవన్

ABN , First Publish Date - 2020-09-26T22:20:48+05:30 IST

గండికోట రిజర్వాయర్ ముంపు నుంచి తాళ్లప్రొద్దుటూరు గ్రామస్తులను కాపాడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కోరారు. పరిహారం అందనందున ఇక్కడే ఉంటామని కాలనీవాసులు చెబుతున్నారని

గండికోట రిజర్వాయర్ ముంపు గ్రామస్తులను కాపాడాలి: పవన్

అమరావతి: గండికోట రిజర్వాయర్ ముంపు నుంచి తాళ్లప్రొద్దుటూరు గ్రామస్తులను కాపాడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కోరారు. పరిహారం అందనందున ఇక్కడే ఉంటామని కాలనీవాసులు చెబుతున్నారని, వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్థోమత వారికి లేదని చెప్పారు. వృద్దులు, చిన్నారులు సైతం వరద నీటిలో చిక్కుకున్నారని తెలిపారు. తాళ్లప్రొద్దుటూరు విడిచే వరకు గ్రామస్తుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలని పవన్‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు. 


గండికోట నిర్వాసితుల ఆందోళన 24వ రోజుకు చేరింది. తాళ్లప్రొద్దుటూరు ఎస్సీ కాలనీ ఇళ్లల్లోకి గండికోట బ్యాక్‌వాటర్‌ చేరింది. ఇప్పటికే బీసీ కాలనీలోకి నీళ్లు చేరడంతో వారు ఖాళీ చేసి వెళ్లారు. ఎస్సీ కాలనీలో కూడా నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పునరావాసం కల్పించకుండా ఇళ్లలోకి నీళ్లు వదిలితే ఎక్కడకు వెళ్లాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాడుగ ఇళ్లు కూడా దొరకడం లేదని ఒకవేళ దొరికినా రూ.50వేల అడ్వాన్స్‌తో నెలకు రూ.5వేలకు పైగా బాడుగ అడుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-26T22:20:48+05:30 IST