గండి చెరువు ‘ముంపు’ పరిహారం ఎప్పుడో..?

ABN , First Publish Date - 2022-08-11T05:16:38+05:30 IST

మండలంలోని గండి చెరువు ముంపు భూములకు పరిహారం ఎప్పుడు అందిస్తారా ఆని బాధిత రైతులు ఎదు రు చుస్తున్నారు.

గండి చెరువు ‘ముంపు’ పరిహారం ఎప్పుడో..?
నిండిన గండి చెరువు, నీళ్లలో పొలాలకు వెళ్తున్న రైతులు







అవతలి భూములకు దారి లేక ఇబ్బందులు

ప్రహరీ లేక వేపలకుంట గ్రామంలోకి వెళ్తున్న నీరు

ఇబ్బంది పడుతున్న రైతులు, గ్రామస్థులు

గాండ్లపెంట, ఆగస్టు 10: మండలంలోని గండి చెరువు ముంపు భూములకు పరిహారం ఎప్పుడు అందిస్తారా ఆని బాధిత రైతులు  ఎదు రు చుస్తున్నారు. మండలంలోని సోమయజులపల్లిపంచాయతీలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన గండిచెరువు చాలా క్రితం తెగిపోయిన ట్లు సమాచారం. ఆ చెరువు నిర్మాణ పనులను చేపట్టాలని రైతు సంఘా లు, పలు గ్రామల రైతులు ఆప్పటి ప్రభుత్వలపై ఒత్తిడి తీసుకురాగా... చివరకు 2000 సంవత్సరంలో అప్పటి ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో చర్చించి నిర్మాణ పనులకు కోటి రూపాయలు మాంజురు చేశారు.  చెరువు ముంపు భూమిగా 57 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఆందులో పంటలు సాగు చేస్తున్న భూమి కి ఎకరానికి రూ. 2.4 లక్షలు, పంటలు సాగుచేయని భూములకు రూ. 1.35 లక్షలు పరిహరం ఆందిస్తామన్నారు. కల్వర్ట్‌ నిర్మించి చెరువు ఆవతలి వైపు ఉన్న భూములకు రస్తా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆప్పట్లో కొంత మంది రైతులకు పరిహారం ఆందించారు. పలు సమస్యల కారణంగా ఇంకొందరికి ఆందలేదు. ఆప్పటి నుంచి  రెవెన్యూ ఆధికారుల చుట్లూ ఎన్ని సార్లు తిరిగిని పరిహారం ఆందలేదని బాధిత రైతులు అంటున్నారు. ఇప్పటికే పలువురు తహసీల్దార్లకు, ఆర్‌డీఓలకు ఆర్జీలుసమర్పించినా తమ సమస్య వారు తెలిపారు. అయితే గండి చెరువు నిర్మాణ పనులు పూర్తయి పదేళ్లు కావస్తోంది. ఐదేళ్ల నుంచి చెరువు నిండుతోంది.  చెరువు ఆవతల భూములకు రహదారి లేకపోవడంతో... చెరువులోకి పూర్తిగా నీళ్లువస్తే పంటలు సాగు చేయలన్నా, పండిన పంటను తీసుకు రావాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలుపుతున్నారు. గత యేడాది భారీ వర్షాల కారణంగా చెరువు నిండి వేపలకుంట గ్రామంలోని ఇళ్లలో నీరు చేరింది. చెరువు ఆవతల భూములకు రస్తా ఏర్పాటు చేయాలని,  వేపలకుంట గ్రామంలోకి నీరు రాకుండా ఆ గ్రామం చుట్లూ ప్రహరీ నిర్మించాలని ముంపు భూములను, దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెలే పీవీ సిద్దారెడ్డికి  ఆ గ్రామ ప్రజలు విన్నవించారు. అప్పట్లో ఆయన హామీ ఇచ్చారే కానీ  ఇంత వరకు పనులు చేపట్టలేదు. ముంపు భూములకు పరిహరం, చెరువు అవతల భూములకు రస్తా,  వేపలకుంట చుట్లూ ప్రహరీ ఎప్పుడు నెరవేరుతాయోనని ఆ గ్రామ ప్రజలు రైతులు అయోమయంలో ఉన్నారు.

ముంపు భూముల పరిహారంపై స్థానిక తహసీల్దార్‌ రవిని అడుగగా... విచారించి పరిహారం బాధితులకు న్యాయం చేస్తాం అన్నారు. త్వరలో  అందనివారందరికి పరిహారం ఇప్పించడానికి చర్యలు తీసుకుంటామని  తెలిపారు.


Updated Date - 2022-08-11T05:16:38+05:30 IST