Abn logo
Mar 1 2021 @ 01:17AM

భక్తిశ్రద్ధలతో గంధమహోత్సవం

పామూరు, ఫిబ్రవరి 28: పామూరు మేజర్‌ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో వెలిసిన ‘హజరత్‌ సయ్యద్‌ కరీముల్లాషా హాజీ ఉరఫ్‌ కాలేషాపీర్‌ మస్తాన్‌వలి రహంతుల్లా అల్లాహీ’ 55వ గంధమహోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ గంధమహోత్సవం సందర్భంగా స్వామి వారి దర్గాను రంగురంగుల విద్యుత్‌దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా జరిగే గంధమహోత్సవ వేడుకలకు హిందూ ముస్లిం భక్తులు పాల్గొని స్వామి వారికి నైవేద్యం సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సోమవారం 1వ తేదీన రాత్రి 10 గంటలకు దీపారాధన, 2న మంగళవారం తహలీల్‌ పాతేహా మరియు భక్తులు గంధం, తాంబూలం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement