గాంధీ శాంతి మార్గమే మానవాళికి రక్ష

ABN , First Publish Date - 2022-10-03T06:19:31+05:30 IST

జాతిపిత మహాత్మాగాంధీ శాంతి మార్గమే మానవాళికి అనుసరనీయమని కలెక్టర్‌ పాటిల్‌హేమంత్‌ కేశవ్‌ అన్నారు.

గాంధీ శాంతి మార్గమే మానవాళికి రక్ష
కోదాడలో గాంధీ, శాస్త్రి చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న పబ్లిక్‌ క్లబ్‌ కమిటీ నాయకులు

కలెక్టర్‌ పాటిల్‌హేమంత్‌ కేశవ్‌ 

జిల్లా వ్యాప్తంగా గాంధీ చిత్రపటాలు, విగ్రహాల వద్ద నివాళులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, అక్టోబరు 2: జాతిపిత మహాత్మాగాంధీ శాంతి మార్గమే మానవాళికి అనుసరనీయమని కలెక్టర్‌ పాటిల్‌హేమంత్‌ కేశవ్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా  జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహానికి  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌  పెరుమాళ్ల అన్నపూర్ణతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించి  మాట్లాడారు. ప్రజలను  ఐక్యం చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడు గాంధీ అని కొనియాడారు. అహింస, సత్యాగ్రహంతో  క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని నడిపి బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించారని తెలిపారు. ముందుగా గాంధీ  చిత్రపటానికి పూలమాల వేశారు.   కార్యక్రమంలో అద నపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌రావు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఎస్పీ నాగభూషణం, డీపీవో యాదయ్య, సీపీజీవో వెంకటేశ్వర్లు, డీఎవో రామారావునాయక్‌, డీఎం రాంపతి, మునిసిపల్‌ కమిషనర్‌ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, దయానందరాణి, శంకర్‌,  లలితాదేవి  పాల్గొన్నారు. 

-  గాంధీ చిత్రపటానికి  సూర్యాపేట కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో  టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంజద్‌ అలీ, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో  ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, పట్టణంలో లంబాడీ విద్యార్థి సేన  జిల్లా అధ్యక్షుడు భానోత్‌ హరీష్‌నాయక్‌,  జిల్లా గ్రంథాలయంలో సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా, పట్టణ అధ్యక్షులు గండూరి శంకర్‌, గండూరి కృపాకర్‌, బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు  నివాళులర్పించారు. 

- కోదాడలోని పబ్లిక్‌ క్లబ్‌లో గాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి చిత్రపటాలకు  పబ్లిక్‌ క్లబ్‌ కమిటీ అధ్యక్షుడు వక్కవంతుల నాగార్జున, కార్యదర్శి కొల్లూరి రామిరెడ్డి చింతలపాటి శ్రీనివాస్‌రావు నివాళులర్పించారు.  

- హుజూర్‌నగర్‌  మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ మఠంపల్లిలో  ఎంపీపీ ముడావత్‌ పార్వతి కొండానాయక్‌, జడ్పీటీసీ జగన్‌నాయక్‌, పట్టణంలోని సబ్‌ జైలులో జూనియర్‌ సివిల్‌ జడ్జి సంకేత్‌మిత్రా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో మామిడి జానకిరాములు, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు.

- సూర్యాపేటలో గాంధీ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు నివాళులర్పించారు.

- ఆత్మకూరు(ఎస్‌), హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌  కార్యాల యం ఎదుట నిరవధిక దీక్ష చేస్తున్న వీఆర్‌ఏలు  గాంధీ చిత్రపటం ఎదుట నివాళులర్పించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ రజిత సుధాకర్‌, సతీష్‌, పాల్గొన్నారు. అనంతగిరి, తిరుమలగిరి, మోతె, చిలుకూరు, నూతనకల్‌, మద్దిరాల, కోదాడ, మఠంపల్లి తదితర మండలాల్లో గాంధీ చిత్రపటాలకు నివాళులర్పించారు.




Updated Date - 2022-10-03T06:19:31+05:30 IST