గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి

ABN , First Publish Date - 2022-08-11T05:45:52+05:30 IST

కూడళ్ల సుందరీకరణ పేరుతో తొలగించిన గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్‌ గాంధీ చౌరస్తాలో బుధవారం రాస్తారోకో చేశారు.

గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి
గాంధీ చౌక్‌లో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 10: కూడళ్ల సుందరీకరణ పేరుతో తొలగించిన గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్‌ గాంధీ చౌరస్తాలో బుధవారం రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు నలిచిపోయాయి. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో కూడా గాంధీ విగ్రహాన్ని నెలకొల్పకపోవడం విచారకరమన్నారు. స్థానిక మంత్రికి ఇతర వ్యవహారాల్లో ఉన్న శ్రద్ధ జాతీయ నాయకుల విగ్రహాలపైనగానీ, అభివృద్ధిపైనగానీ లేదన్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సమద్‌ నవాబ్‌, ఎండీ తాజ్‌, సయ్యద్‌ అఖీల్‌, లింగంపల్లి బాబు, సలీముద్దీన్‌, ఇర్ఫాన్‌, దండి రవీందర్‌, మామిడి సత్యనారాయణరెడ్డి, మేకల నర్సయ్య, దన్నాసింగ్‌, సహేష్‌షా, నదీం, చంద్రయ్యగౌడ్‌, కుర్ర పోచయ్య, రమేష్‌, చాంద్‌, మంజుల పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:45:52+05:30 IST